Friday, March 29, 2024

త‌న ఫ‌స్ట్ మూవీ రిలీజ్ కాక‌ముందే – అరెస్ట్ అయిన డైరెక్ట‌ర్

ఇంకా సినిమా రిలీజ్ కాలేదు అప్పుడే ఆ డైరెక్ట‌ర్ పై వేటు ప‌డింది. మ‌ల‌యాళ చిత్రం ప‌డ‌వెట్టు ద‌ర్శ‌కుడు లిజు కృష్ణ పై అత్యాచారం ఆరోపణలు రావ‌డంతో కేరళలోని కన్నూర్ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ వివాదం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. పడవెట్టు సినిమాకు సంబంధించిన అంశాల్లో లిజు కృష్ణకు సహకరించిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంజు వారియర్, అదితి బాలన్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నటుడు సన్నీ వేన్ నిర్మించారు. పెదవెట్టు సినిమాతో దర్శకుడిగా లిజు కృష్ణ వెండి తెరకు పరిచయం కనున్న్నాడు. ఇదే అతని తొలి చలనచిత్రం.

ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు. ఇంతకుముందు.. సన్నీ వేన్, లిజు కలిసి మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే నాటకానికి పనిచేశారు. ఈ నాటకానికి సన్నీ దర్శకత్వం వహించగా, లిజు నిర్మించారు.కస్టడీలోకి తీసుకున్న సమయంలో లిజు స్వస్థలం కన్నూర్‌లో పడవెట్టు షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడు అరెస్ట్ తో పెదవెట్టు మూవీకి సంబంధించిన తదుపరి పనులు ఆగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే పెదవెట్టు విడుదల చేయాలని భావించారు. కొచ్చిలో టాటూ ఆర్టిస్ట్‌పై వరుస లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..లిజు కృష్ణను ఐపిసి 376 సెక్షన్ కింద అరెస్టు చేశాం. అయితే ఫిర్యాదు చేసిన యువతి సినిమాకు చెందిన వ్యక్తి కాదని.. ఆ యువతికి చెందిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement