Thursday, April 25, 2024

బీసీలు బ్యాక్ బోన్..కొనియాడిన జ‌గ‌న్..

బీసీల‌ను వెన‌కేసుకొచ్చారు వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్..బీసీలు అంటే బ్యాక్ బోన్ అంటూ కొనియాడారు.
దేశంలో బీసీల జనాభా 52 శాతం ఉన్నా సరియైన అవకాశాలు లేవని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవన్నారు.. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని స్పష్టం చేశారు. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదన్నారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదన్నారు..

బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా స్వాలంభన సాధిచాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని జగన్‌ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామని చెప్పారు. 13 మేయర్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్‌ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement