Tuesday, April 13, 2021

హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు..!

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కేవలం ఆరు స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తున్నట్లు బీసీ ఇదివరకే స్పష్టం చేసింది. గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించారు.

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలవబోతోంది. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో పనిచేసే పలువురు సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ముంబైలో జరిగే అన్ని మ్యాచ్‌లను.. హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News