Thursday, March 28, 2024

బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని- ప్రారంభించిన మంత్రి గంగుల

బీసీ విద్యార్థుల కోసం ఖమ్మంలో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..లక్షా 25వేల మంది బీసీ బిడ్డలకు అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నామని, ఎకరా విస్తీర్ణంలో మూడున్నర కోట్లతో నాలుగు అంతస్థుల్లో అద్భుత భవనాన్ని ఖమ్మంలో నిర్మించుకున్నామన్నారు. వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు అందేలా ఈ స్టడీ సర్కిల్ కృషి చేస్తోందన్నారు. ఇంకా ఎక్కువ దరఖాస్తులు వచ్చినా అత్యుత్తమ కోచింగ్ అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ సిద్ధం గా ఉందన్నారు. కోచింగ్ కావాలనుకున్న బీసీ అభ్యర్థి జిల్లా యంత్రాంగానికి, స్టడీ సర్కిలల్లో దరఖాస్తులు ఇవ్వండన్నారు. 12 స్టడీ సర్కిల్లో తొమ్మిదింటికి అత్యుత్తమ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్, రీడింగ్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ ల తో కూడిన సొంత భవనాలు.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 108 బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.తెలంగాణకు ముందు 19 గురుకులాలను 281 పెంచిన ఘనత కేసీఆర్ దని,నాడు 9 వేల మంది ఉంటే నేడు లక్ష యాభై రెండు వేల మంది బీసీ గురుకులాల్లో చదువుకుంటున్నారన్నారు.. మేనమామల ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని,బీసీల ఆత్మగౌరవం కోసం వేల కోట్లతో భవనాలు నిర్మిస్తున్న బీసీ పక్షపాతి కేసీఆర్ అన్నారు.
కెసిఆర్ లా బీసీలపై అత్యంత అభిమానం చూపే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని, ఖమ్మం నగరం నడిబొడ్డున ఎంత ఖరీదు చేసే భూమి బిసి స్టడీ సర్కిల్ కు ఇవ్వడం సంతోషమన్నారు.అతి త్వరలోనే ఖమ్మంలో బీసీ భవనాన్ని నిర్మిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement