Saturday, April 20, 2024

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో – బ‌తుక‌మ్మ వేడుక‌లు

తెలంగాణ‌లో మ‌హిళ‌లు ఘ‌నంగా జ‌రిపే పూల పండుగ బ‌తుక‌మ్మ‌. గ‌త సంవ‌త్స‌రం దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించారు. దసరా పది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యానికి బీజేపీ భంగం కలిగిస్తోందని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా అనుకూల, సంక్షేమ ఆధారిత దృక్పథం కోసం పాల‌న సాగిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బాల్కొండలోని కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ వేడుకలను ఎనిమిది దేశాల్లో నిర్వహించనుంది. తెలంగాణ ప్ర‌జ‌లు తొమ్మిది రోజుల పాటు జ‌రుపుకునే ఈ వేడుక‌ను.. ఖండాత‌రాలు దాటి జీవ‌నం సాగిస్తున్న తెలుగు ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఎంతో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను జరుపుకుంటున్నారు. రాష్ట్ర విశిష్ట సంస్కృతి బతుకమ్మను ప్రపంచ పటంలో అంగరంగ వైభవంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో బతుకమ్మ వేడుకలు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement