Tuesday, April 23, 2024

Telangana: 22న బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల జాబితా.. సీట్లల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 22న ఆర్జీయూకేటీ(బాసర ట్రిపుల్‌ ఐటీ) ప్రవేశాల జాబితా విడుదల కానుంది. మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు ఈమేరకు వర్సిటీ ఇంఛార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ సీట్లల్లో ఈ సంవత్సరం నుండి ఈడబ్య్లూఎస్‌ కోటాను అమలు చేయనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు.

ఈ 1500 సీట్లల్లో స్పెషల్‌ కేటగిరీ కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404 సీట్లలో వివిధ రిజర్వేషన్లకు గానూ 702 సీట్లు, మిగిలిన జనరల్‌ కేటగిరీలోని 702 సీట్లల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 140 సీట్లను కేటాయించనున్నారు. దీంతోపాటు 75 గ్లోబల్‌ సీట్లు, 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు కూడా అందుబాటులో ఉంటాయని వర్సిటీ సంచాలకులు ప్రొఫెసర్‌ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ అయిపోయి వర్సిటీ నుంచి టీసీ తీసుకొని వెళ్లిపోయిన వారిలో 3 నుంచి 4 శాతం మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఎంసెట్‌ తదితర కోర్సులవైపు వెళ్లనున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement