Friday, April 19, 2024

GabbarSingh: హరీష్ శంకర్‌కి బండ్ల గణేష్ సూపర్ కాస్ట్ లీ గిఫ్ట్

గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేష్. ఈ మూవీతోనే ఇటు దర్శకుడు హరీష్ శంకర్, అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. అయితే, గబ్బర్ సింగ్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్‌కి నిర్మాత బండ్ల గణేష్ సూపర్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కు ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేశ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఒమెగా సీమాస్టర్ అనే ప్రీమియం వాచ్ ను హరీశ్ శంకర్ కు బహూకరించారు. అంతేకాదు స్వయంగా ఆయనే హరీశ్ చేతికి గడియారాన్ని పెట్టారు.

తనకు గిఫ్ట్ ఇచ్చినట్టు హరీశ్ శంకర్ ట్విట్టర్ లో ఓ వీడయోను పోస్ట్ చేశారు. గణేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గబ్బర్ సింగ్ నిర్మాణానికి ఎనలేని మద్దతునిచ్చిందుకు ధన్యవాదాలు అని చెప్పారు. ‘‘నాకు మీరెప్పుడూ ప్రత్యేకమే. నువ్వు లేకపోతే సినిమా అంత వేగంగా అయ్యేదే కాదు. సినిమా అంటే పరితపించే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా’’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. కాగా, పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు హరీశ్ శంకర్. 2012 మేలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement