Thursday, March 28, 2024

కరోనా చికిత్సకు మరో ఔషధం

కరోనా చికిత్సకు త్వరలో మరో ఔషధం అందుబాటులోకి రానుంది. దేశీయ ఔషధ సంస్థ బజాజ్ హెల్త్​కేర్ ‘ఇవీజాజ్’​ పేరుతో ఈ ఔషధాన్ని ఆవిష్కరించింది. తమ సొంత పరిశోధన, అభివృద్ధి బృందం ద్వారానే దీనిని సాధ్యం చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త ఔషధం తయారీ, మార్కెటింగ్​కు.. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీనిని దేశీయ వినియోగంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకూ అనుమతులు లభించినట్లు బజాజ్ హెల్త్ కేర్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement