పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా దాడి చేశాడు. కడుపులో తన్నుతూ.. కొడుతూ కర్కశంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్ లో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని మహంతేశ్ చొలచగడ్డ, బాధితురాలిని సంగీత షిక్కేరిగా గుర్తించారు. ఇద్దరి మధ్య ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాగల్ కోట్ లోని హార్టికల్చర్ సైన్సెస్ లో ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహంతేశ్ ను అరెస్ట్ చేశారు. బీజేపీ బాగల్ కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు సంగీ తెలిపింది. ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని పేర్కొంది.
దారుణం: నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి

Previous articleBreaking : హాలీవుడ్ ప్రముఖ నటుడు – ఫ్రెడ్ వార్డ్ కన్నుమూత
Next articleఅమిత్ షా కాదు అబద్ధాలకు బాద్ షా..
Advertisement
తాజా వార్తలు
Advertisement