Saturday, June 3, 2023

Loan App: నంద్యాల‌లో ఘోరం.. లోన్ యాప్ ఆగ‌డాల‌కు ఇంజినీరింగ్​ విద్యార్థి బ‌లి!

ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. లోన్​ యాప్​ ఆగడాలకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థి వీరేంద్రనాథ్ తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరేంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఇంజనీరింగ్ విద్యార్థి తన చదువు నిమిత్తం లోన్ యాప్​ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న లోన్​ చెల్లించాలని విద్యార్థిపై యాప్ నిర్వాహకులు ఒత్తిళ్లు పెంచడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement