హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవ్వాల (మంగళవారం) రాత్రి ఘోరం జరిగింది. దారిలో వెళ్తున్న కంటైనర్ లారీని వెనకనుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
- Advertisement -