Thursday, April 25, 2024

ముగిసిన బీఏసీ.. 6న బడ్జెట్.. 8న బడ్జెట్ పై చర్చ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8వ తేదీన బీఏసీ మరోసారి సమావేశమై తదుపరి షెడ్యూల్ పై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రేపు గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ఈనెల 6న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8న బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement