శంకరపల్లి (ప్రభ న్యూస్): తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణించిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ఇవ్వాల (శనివారం) రాత్రి కన్నుల పండువగా కలశపూజ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు.
- Advertisement -
ఆలయ ప్రాంగణంలో వెయ్యి కళాశాలతో కలశ పూజా నిర్వహించేందుకు పీఠాధిపతులు, బ్రాహ్మణోత్తములు వచ్చారు. కేరళలోని శబరిమల ఆలయం నుండి తాంత్రిక స్వాములు కూడా తరలివచ్చారు. ఇక.. ఆలయ కమిటీ వారు దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతటి మహోన్నతమైన పూజా కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు భక్తజనం కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.