Friday, April 19, 2024

FLASH: క్రీడాలోకంలో విషాదం.. ఆసీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ మృతి

ఆస్ట్రేలియ దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. క్వీన్స్​లాండ్​లోని అలైస్​ రివర్​ బ్రిడ్జ్​ దగ్గర ఉన్న హెర్వే రేంజ్​ రోడ్​లో జరిగిన కారు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 10.30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

ఇటీవలే ఆసీస్​ ప్లేయర్స్​ రాడ్​ మార్ష్​, స్పిన్​ దిగ్గజం షేన్ వార్న్​ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దిగ్గజ ఆటగాడు అండ్రూ సైమండ్స్ మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

కాగా, కెరీర్​లో ఆల్​రౌండర్​గా సత్తా చాటిన సైమండ్స్​.. మొత్తంగా 26టెస్టులు(1462 పరుగులు, 24 వికెట్లు), 198 వన్డేలు(5088, 133), 14 టీ20లు(337, 8), 39 ఐపీఎల్(974, 20) మ్యా​చులు ఆడాడు. ఆసీస్​ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అతడు​ 2012లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement