Friday, March 29, 2024

Flash.. Flash: ఏటీఎంలో భారీ చోరీకి యత్నం.. పోలీసుల రాక‌తో పారిపోయిన నిందితులు

ఎస్ బీ ఐ ఏటీఎంలో భారీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో జ‌రిగింది. ఇవ్వాల (బుధవారం) తెల్లవారుజామున ఐదుగురు నిందితులు జైపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్ బి ఐ ఎటిఎం ను గ్యాస్ కట్టర్ లతో పగలగొట్టి భారీ నగదు చోరీకి ప్రయత్నించారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా చోరీ ప్రయత్నాన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు. సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంను గ్యాస్ కట్టర్ లతో పగలగొడుతున్న దృశ్యాలను సిబ్బంది చూసి జైపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు

సమాచారం అందుకున్న జైపూర్ ఏసిపి నరేందర్, ఎస్సై రామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని నిందితులు నగదు బాక్సులతో పాటు వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సామాగ్రిని అక్కడే వదిలేసి పారిపోయారు. సీసీ కెమెరాల ద్వారా ఐదుగురు నిందితులు ఒక కారు, ఇతర వాహనంపై వచ్చారని గుర్తించారు. మహారాష్ట్ర గ్యాంగ్ గా అనుమానించి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సమయానికి పోలీసులు చేరుకోవడంతో ఏటీఎంలో ఉన్న న 22.45 లక్షల రూపాయల నగదు చోరీ కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న బ్యాంకు అధికారులు నగదును లెక్కించి నగదు చోరికి గురి కాలేదని నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement