Friday, April 26, 2024

Breaking: ఆర్మూర్ లో హై టెన్షన్.. మున్సిపల్ వైస్ చైర్మన్ పై దాడి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై దాడి జరిగింది. పెర్కిట్ లో డ్రైనేజీ సమస్యను పరిశీలిస్తుండగా వైస్ చైర్మన్ మున్నుపై సత్తార్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట చోటుసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

గతంలో పెర్కిట్ లో కోకాలను తొలగించే విషయమై కమిషనర్ పై సత్తార్ దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం సత్తార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్ను భాయ్ చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement