Tuesday, March 26, 2024

ఆట డ్యాన్స్ షో ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ టీనా మృతి

ఆట డ్యాన్స్ షో ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ గా నిలిచింది టీనా. ఆమె మృతి చెందింది.ఓంకార్ యాంకర్‌గా వ్యవహరించిన ఆట డ్యాన్స్ రియాలిటీ షో చాలా పాపులరైన సంగతి తెలిసిందే. కాగా గ‌త‌ కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా.. మృతిచెందింది. ఈ విషయాన్ని ఆట సందీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టీనా మరణవార్త విని దిగ్భ్రాంతి చెందినట్టుగా చెప్పాడు. ఆమెతో తన‌కున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘ఆట ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా సాధు మరణించిందనే విషాద వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధపడ్డాను. ఆమె చాలా వినయపూర్వకమైన వ్యక్తి.. జీ తెలుగు ఆట-1 డాన్స్ రియాలిటీ షోలో నా కో పార్ట్నర్. ఆమె కుటుంబానికి, ఆమెను ప్రేమించేవారికి నా ప్రగాఢ సానుభూతి’’అని ఆట సందీప్ పేర్కొన్నాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక, టీనా మృతిపై పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆట సీజన్ వన్ విన్నర్‌గా నిలిచిన టీనా.. ఆ తర్వాత సీజన్‌ 4లో జడ్జ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే టీనా మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement