Thursday, April 25, 2024

Big Breaking | పాతబస్తీలో దారుణం.. బాలుడిపై వీధికుక్క అటాక్​!

హైదరాబాద్​లో మరో భయంకరమైన ఘటన జరిగింది. ఇవ్వాల (మంగళవారం) పాత బస్తీలో ఓ బాలుడిని కుక్క దారుణంగా కరిచేసింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడిచేసింది. వీధి కుక్క దాడితో అయిదేండ్ల బాలుడికి తీవ్రంగా గాయలయ్యాయి. అటువైపు వెళ్తున్న వారు చూసి కుక్కను కర్రలతో తరిమేశారు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

హైదరాబాద్​ సిటీలో ఏ వీధిలో చూసిన కుక్కలు మందలుగా కనిపిస్తున్నాయి. జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు కాలనీల నుంచి సమాచారం అందుతోంది. జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది పిల్లలు బలికావాల్సి వస్తుందని నగర ప్రజలు భగ్గుమంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement