వరదల్లో ఏటీఎం కొట్టుకుపోయింది. ఈ ఏటీఎంలో రూ.24లక్షల నగదు ఉంది.కాగా ఈ సంఘటన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో చోటు చేసుకుంది. కుమోలో నది వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పురోలాలో నది ఒడ్డున 8 దుకాణాలు, ఏటీఏం వున్నాయి. వరదల కారణంగా అవన్నీ కొట్టుకుపోయాయి. ఏటీఎంలో రూ.24 లక్షల నగదు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం సాయంత్రమే ఇందులో నగదును డిపాజిట్ చేశారు అధికారులు. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కుమోలో నదిలో ప్రవాహం పెరిగి వరదలకు దారి తీసింది. వరద ఉద్ధృతి కొనసాగుతూ వుండటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
- Advertisement -