Wednesday, April 24, 2024

ఆర్‌టీసి క్రాస్ రోడ్‌లో – ట్రిపుల్ఆర్ అరుధైన ఘ‌న‌త‌

ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు తిర‌గ‌రాసిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రో రికార్డును త‌న‌పేరిట లిఖించుకుంది.ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించారు. హైద‌రాబాద్ ఆర్‌టీసి క్రాస్ రోడ్‌లో ట్రిపుల్ఆర్ అరుధైన ఘ‌న‌త‌ను సాధించింది. తాజాగా ఈ చిత్రం 5కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. వ‌రుస‌గా 4, 5 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది. దీనికంటే ముందు బాహుబ‌లి-2 3.76కోట్లు, రంగ‌స్థ‌లం 2.41 కోట్లు రాబ‌ట్టి త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ చిత్రంతో ప్ర‌భాస్ త‌రువాత‌ తార‌క్‌, చ‌ర‌ణ్‌లు 1000కోట్ల క్ల‌బ్‌లో నిలిచిన హీరోలుగా నిలిచారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో తార‌క్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించగా, చ‌ర‌ణ్ అల్లూరీ సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయిక‌లుగా న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement