Friday, April 26, 2024

ఖగోళ అద్భుతం.. చంద్రుని వెనకనుంచి మెల్లగా జారుకుంటున్న శని!

అంతరిక్షం అంటేనే ఒక అద్భుతాల గని.. ఎంత పరిశీలించినా.. ఎంతగా శోధించినా అంతుచిక్కదు.. అట్లాంటిది మన శాస్త్రవేత్తలు నిత్య శోధనలో ముందడుగు వేస్తూనే ఉన్నారు. చంద్రునిపై, అంగారకుడిపై, శనిగ్రహంపై జీవజాలం ఉందా అనే అంశాలపై పలు పరిశోధనలు జరగుతున్నాయి.

అయితే.. ఖగోళ శాస్త్రవేత్త జాన్ కోయెట్ మాత్రం భూమి ఆధారిత టెలిస్కోప్ ద్వారా ఓ వీడియో చిత్రీకరించారు. అదేంటంటే.. చంద్రుని వెనుకనుంచి మెల్ల మెల్లగా శనిగ్రహం వెళ్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో మీరూ ఆ దృశ్యాలను చూడొచ్చు.. ఇది చూసిన చాలామంది అద్భుతమైన ఫుటేజ్ అని కొనియాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement