Tuesday, April 23, 2024

అసెంబ్లీ 56.25 గంట‌లు – మండ‌లి 17.00 గంట‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చరిత్రలో రెగ్యులర్‌ షెడ్యూల్‌ కంటే నెలరోజుల ముందస్తుగా మొదలైన తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావే శాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్‌ సమా ధానం తర్వాత శాసనసభ, మండలిలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉభయ సభల సభాపతులు ప్రకటిం చారు. మొత్తంగా 56.25 గంట లపాటు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాయి. ఈ నెల 3న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో మొదలైన సంగతి తెలిసిందే. తొలుత గవ ర్నర్‌ ప్రసంగం లేకుండా మొద లవుతాయని భావించిన సమావేశాలు, బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం తెలుపకుండా నెలకొన్న విపత్కర పరిస్థితులు, ఆ తర్వాత హైకోర్టులో ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తదితర రసవత్తర సన్నివేశాలతో హాట్‌హాట్‌గా మొదలైన ఉభయ సభలు ఈ నెల 6న ఉభయ సభల్లో 2023-24 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపె ట్టడం, ఆ తర్వాత రోజు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. అదేవిధంగా ఈ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలపై చర్చ జరిపారు. ఆదివారం చివరిరోజు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మండలిలో డిప్యుటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఎన్నిక కావడం ఈ సమావేశాల్లో చివరి రోజు దీనిపై ప్రభుత్వం చర్చ జరపడం జరిగింది.


తెలంగాణ చరిత్రలో తొలిసారి ఫిబ్రవరిలో…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలోనే ముగిశాయి. ఆదివారం ఉభయ సభలు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తదుపరి ఆరు రోజుల్లోనే సమావేశాలను ముగించడం గమనార్హం. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మినహా మిగతా సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలో జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా 2014 నవంబర్‌ 5న బడ్జెట్‌ సమావేశాలు ఒతలిసారి జరగ్గా, 2018 డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మరుసటి ఏడాది సెప్టెంబర్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు సందర్భాల్లో మినహా మిగతా సందర్భాల్లో ప్రతిసారి బడ్జెట్‌ సమావేశాలు మార్చిలోనే జరిగాయి. సాధారణంగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం దక్కితేనే పాలనా, ఆర్థిక వ్యవహారాలు, బిల్లులు, వేతనాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బడ్జెట్‌ను మార్చిలో ఆమోదింప జేసుకోవడం ఆనవాయితీ. కాగా తొలిసారిగా ఆదివారంతో బడ్జెట్‌ సమావేశాలు ముగియడం, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం దక్కినప్పటికీ రానున్న 47 రోజులపాటు పాత బడ్జెట్‌ అమలులో ఉండనున్నది.

ఎందుకు ముందుకు జరిపారంటే…?
తొలిసారి ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ సమావేశాల ముగింపుపై రాష్ట్రంలో భిన్న వాదనలు నెలకొన్నాయి. ముందస్తు ఊహాగానాలతో జోరుగా చర్చలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత పార్టీ విస్తరణ దేశవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్‌ విస్తృత కార్యాచరణ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు, సభలు, సమావేశాలు, పార్టీ రాష్ట్ర శాఖలు, జాతీయ విధివిధానాల వంటి వాటిపై ఆయన బిజీగా ఉండనున్నారని పలు కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులను అత్యంత భారీ స్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం, అదేరోజు పరేడ్‌ గ్రౌండ్‌లో పలువురు జాతీయ నేతలు, ముఖ్యమంత్రులతో భారీ బహిరంగ సభకు యోచించారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం, నీరా కేఫ్‌ ప్రారంభించాలని యోచించారు. ఈ నెల చివరి వారంలో బయో ఆసియా సదస్సు రాష్ట్రంలో జరగనున్నది. మరో 8 సమీకృత కలెక్టరేట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని ప్రారంభించుకోవాలని నిర్ణయించారు. ఇంకోవైపు ముందస్తు కోసమే బడ్జెట్‌ సమావేశాలు ముందుగా జరిపారని విశ్లేషించారు. అయితే వీటికి చెక్‌ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడం, కనీసం సచివాలయ ప్రారంభానికి అనుమతివ్వాలని సీఎస్‌ శాంతికుమారి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు చేసినా సఫలం కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఈసీనో చెప్పడం వంటివి జరగడంతో విస్తృతంగా చెలరేగిన ఊహాగానాలకు చెక్‌ పడింది.

ఉభయ సభల్లో పార్టీలు ఇలా…
శాసనసభలో సీఎం కేసీఆర్‌, అధికార మంత్రులు అత్యధికంగా 30గంటల 43 నిమిషాలు మాట్లాడగా, బీఆర్‌ఎస్‌ పార్టీ 11గంటల5 నిమిషాలు వినియోగించుకున్నది. ఎంఐఎం 6గంటల 4 నిమిషాలు, కాంగ్రెస్‌ 5గంటల 46 నిమిషాలు, బీజేపీ 2గంటల 33 నిమిషాలు వినియోగించుకున్నాయి.
సీఎం కేసీఆర్‌ 2గంటల 31 నిమిషాలుపాటు ప్రసంగించారు. ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ 5గంటల 20నిమిషాలు కాంగంస్‌ పక్షనేత 3గంటల 14 నిమిషాల సమయాన్ని వినియోగించుకున్నారు. ఈ సభలో ఒక్కసారి కూడా అంతరాయం లేకుండా మొదటిసారి ప్రశాంతంగా సమావేశాలు కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement