Friday, May 20, 2022

Asani Cyclone: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

అసని తుఫాను ప్రభావం తెలంగాణపైనా పడింది. హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం చిరు జల్లులు పడ్డాయి. వాతావరణ మేఘావృతమై ఉంది. తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రేపు కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement