Thursday, April 25, 2024

కూలిన ఆర్మీ హెలికాఫ్టర్..ఎలర్టయిన రెస్య్కూ టీం

అడ్వాన్స్ లైట్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది.ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు సమాచారం. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ అప్పర్ సియాంగ్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టుటింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో మిగ్గింగ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే, హెలికాప్టర్ కూలిపోయిన చోటుకు దారులేవీ కనెక్ట్ అయి లేవు. కాబట్టి, ప్రత్యేకంగా రెస్క్యూ టీమ్‌ను పంపినట్టు డిఫెన్స్ పీఆర్‌వో గువహతి వెల్లడించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి ఎలాంటి రోడ్లు లేవని అప్పర్ సియాంగ్ జిల్లా ఎస్పీ జుమ్మర్ బసార్ వివరించారు. ఓ రెస్క్యూ టీమ్‌ను వెంటనే పంపించామని తెలిపారు.త్వరలోనే ఇతర వివరాలు తెలియవస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement