Thursday, June 1, 2023

Breaking: యూపీలో డెన్ కూల్చివేత.. పలు రకాల ఆయుధాలు స్వాధీనం

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు సాహసమే చేశారు. చాలాకాలంగా సీక్రెట్గా ఆయుధాలు సప్లయ్ చేస్తున్న డెన్ ఎక్కడుందో కనిపెట్టారు. మధురలోని ఆయుధ కర్మాగారం కూల్చేశారు. దౌలత్‌పూర్ ప్రాంతంలో పోలీసులు ఆయుధాల తయారీ యూనిట్‌ను ఛేదించి దాని నిర్వాహకుడిని అరెస్టు చేశారు.

- Advertisement -
   

“ఈ డ్రైవ్ సమయంలో 8 పిస్టల్స్, 4 తుపాకులు, 13 లైవ్ రౌండ్లు, ఆయుధాల తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం” అని SSP గౌరవ్ గ్రోవర్ తెలిపారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10 న చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement