Wednesday, April 24, 2024

మీరు ఎంసెట్ అభ్య‌ర్థులా… బైపీసీ స్టూడెంట్సా… అయితే ఇది చదవాల్సిందే..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : డిసెంబర్‌ 1 నుంచి ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. బీఫార్మసీ, ఫార్మ్‌ డీ, ఫార్మస్యూటికల్‌ ఇంజనీరింగ్‌, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈమేరకు తొలివిడత, తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 3, 4 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. డిసెంబర్‌ 3 నుంచి 5 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. డిసెంబర్‌ 7న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. అలాగే 7 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో సీటు పొందిన అభ్యర్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి.

అదేవిధంగా డిసెంబర్‌ 13 నుంచి ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ను ప్రారంభిం చనున్నారు. 13న స్లాట్‌ బుకింగ్‌, 14న ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 17న తుది విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌ చేయాలన్నారు. డిసెంబర్‌ 18 నుంచి 20 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్‌ 19న స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయిని పేర్కొన్నారు. ఇతరత్రా వివరాలకు టీఎస్‌ ఎంసెట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు అభ్యర్థులను సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement