Tuesday, April 23, 2024

Apple | కొత్త ప్రొడక్ట్స్​, సాఫ్ట్​వేర్​ అప్డేట్స్.. ఇవ్వాల రాత్రే యాపిల్​ స్పెషల్​ ఈవెంట్​!​

ఆపిల్ కంపెనీకి చెందిన అతిపెద్ద ఈవెంట్ WWDC 2023 ఇవ్వాల (సోమవారం) రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్​లో కొత్త హార్డ్ వేర్,  సాఫ్ట్ వేర్ లాంచ్‌కి సంబంధించిన పలు విషయాలను వెల్లడించనున్నారు. ఈ విషయాలన్నీ యాపిల్​ కస్టమర్లు, అభిమానులతో పంచుకునేందుకు ఆ కంపెనీ సీఈవో టిమ్​ కుక్​ రెడీగా ఉన్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రతి సంవత్సరం యాపిల్​ వరల్డ్​ వైడ్​ డెవలపర్​ కాన్ఫరెన్స్​ ఈవెంట్​ని నిర్వహిస్తోంది. జూన్​ 5 వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతంది. కాగా, ఈసారి ఎడిషన్ Apple యొక్క విశ్వసనీయ కస్టమర్‌లకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కొత్త హార్డ్ వేర్‌ను ప్రదర్శించడమే కాకుండా కొత్త సాఫ్ట్ వేర్‌ను కూడా లాంచ్ చేయనుంది.

ఇక.. యాపిల్​ iOS 17, watchOS 10, macOS 14 కు సంబంధించిన ఫీచర్లు.. సామర్థ్యాలను ప్రపంచ వ్యాప్తంగా వెల్లడించనుంది. మూడేళ్ల మాదిరిగానే జూన్ 5 నుంచి జూన్ 9 వరకు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ని యాపిల్​ నిర్వహిస్తూ వస్తోంది. ఈవెంట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. కొంతమంది డెవలపర్‌లు, స్టూడెంట్స్​ కి మాత్రమే Apple Parkలో జరిగే లైవ్​ ప్రోగ్రామ్​కి ఆహ్వానం ఉంటుంది.

- Advertisement -

కాగా, Apple WWDC 2023 జూన్ 5వ తేదీని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్ లో జరుగుతుంది. జూన్ 5న ఉదయం 10 గంటలకు జరిగే కీలకోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. Apple  కంపెనీ తీసుకున్న లక్ష్యాలు.. దాన్ని నెరవేర్చే క్రమంలో చేసిన ప్రయాణం.. కంపెనీ కొత్త లాంచ్‌తో కూడిన కీలకమైన ప్రదర్శన వంటివి ఇందులో ఉంటాయి.

ఇక.. డెవలపర్‌ల కోసం కొత్త టెక్నాలజీలు, అప్‌డేట్‌ల గురించి పూర్తి స్థాయిలో తెలియజేయడానికి  ఆన్‌లైన్ ఈవెంట్‌ను Apple తన YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇది కాకుండా ప్రజలు Safari లేదా Chrome బ్రౌజర్‌లను ఉపయోగించి Apple అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా చూడోచ్చు. iPhone, iPad, Mac, Apple TVలలో కూడా చూడొచ్చు. Apple కీనోట్ జూన్ 5న ఉదయం 10 PDT , 10:30 pm ISTకి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement