Thursday, April 25, 2024

ర‌ష్యాది భీక‌ర యుద్ధ‌మే – సాక్ష్యంగా వీడియో

ఉక్రెయిన్ లోని ప‌లు కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లాయి ర‌ష్యా బ‌ల‌గాలు. దాంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం దాడులు జ‌రుపుతున్నారు. కాగా ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై ప్ర‌ధానంగా దాడులు జ‌రుగుతున్నాయి. జ‌నావాస ప్రాంతాల్లో దాడులు చేయ‌ట్లేద‌ని ర‌ష్యా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నప్ప‌టికీ ప‌లు అపార్ట్‌మెంట్లపై బాంబులు ప‌డుతుండ‌‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను ప‌లు స్థానిక‌, అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు బ‌య‌ట‌పెట్టాయి. ర‌ష్యా భీక‌ర యుద్ధ‌మే చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై కూడా ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డింది. ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియ‌రావ‌ట్లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement