Thursday, April 25, 2024

సినిమా టికెట్ల అమ్మ‌కంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్య

ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోర్టల్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఈ నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిమా టికెట్ల అంశం త్వరలో పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు.  సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మాలనే అంశంపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశంపై కమిటీలు వేశామని… దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగుతోందని వివరించారు.
 
ఈ విషయంపై కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి పని చేయాలనుకున్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మాలని సినిమా ప్రముఖులే కోరారని… వారి సూచనలను ప్రభుత్వం పరిశీలించిందని పేర్ని నాని చెప్పారు. బ్లాక్ టికెట్లను అరికట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని తెలిపారు. కొందరు పన్నులు ఎగవేస్తున్నారననే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. ఆన్ లైన్ లో ప్ర‌భుత్వం టికెట్లు అమ్మ‌కంపై తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ అంగీక‌రించింద‌న్నారు. సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ను క‌ల‌వాల‌ని ఆగ‌స్టులో ప్ర‌య‌త్నించిన కుద‌ర‌లేద‌ని, త్వ‌ర‌లోనే సీఎం టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతార‌న్నారు. సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. నిబంధనలకు లోబడే షోలు ప్రదర్శించాలని చెప్పారు.

ఇది కూడా చదవండిః ఏపీ సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ.. ఎప్పుడంటే?

Advertisement

తాజా వార్తలు

Advertisement