Friday, April 19, 2024

ఏపీలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు!

ఏపీలోటెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు అన్నీ జరిగాయని  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువు ఇచ్చామని, జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్‌కు రమ్మని చెప్పామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణకు ఇంకా మూడు వారాల సమయం ఉందన్నారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారన్నారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి ఆక్సిజన్ సంక్షోభం

Advertisement

తాజా వార్తలు

Advertisement