Wednesday, March 27, 2024

నేడు కీలక పిటిషన్‌లపై విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టులో గురువారం నాడు కీలక పిటిషన్‌లపై విచారణ జరగనుంది.

★ ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఆనందయ్య మందుకు సంబంధించిన రిపోర్టులను అందించాలని గత విచారణలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య కంటి చుక్కల మందుపై ఇంకా పరీక్షలు పూర్తి కాలేదని గత విచారణలో హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల సమయం కోరగా.. అంత సమయం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది

★ ఏపీలో కరోనా పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.

★ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలన్నహైకోర్టు విచారణ జరపనుంది. ఈ పిటిషన్‌ల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఈరోజు తన అభిప్రాయాన్ని కోర్టుకు వివరించనుంది

★ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అమూల్ కంపెనీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై గతంలో రఘురామ పిటిషన్ వేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం 117ను రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement