Thursday, April 25, 2024

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు అసహనం

ఏపీలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబరులో తోట సురేష్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కేసులు, టెస్టుల విధానం, పడకలు, మందుల వివరాలు ఇవ్వాలని అడిగినా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్‌లోకి తరలి వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 27 లోగా అఫిడవిట్ దాఖలు చేయకపోతే ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. వెంటనే ధర్మాసనం రాష్ట్రంలో కరోనా ట్రీట్‌మెంట్ వివరాలు కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement