Thursday, October 3, 2024

సండే ఫండే: సౌథాఫ్రికా టూర్​ని ఎంజాయ్​ చేస్తున్న అనుష్క శర్మ

బాలీవుడ్​ నటి అనుష్క శర్మ సండేను ఫండేగా ఫుల్​ ఎంజాయ్​ చేస్తోంది. తాను ఎంజాయ్​ చేస్తున్న విధానాన్ని అభిమానులకు ఇన్​స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో నవ్వుతూ కనిపిస్తోంది. ‘‘ఈ రోజు చాలా సంతోషంగా ఉంది’’.. అని పోస్టు చేస్తూ హార్ట్ ఎమోజితో పాటు..  “త్రోబ్యాక్” అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో షేర్​ చేసిన ఫొటోల్లో పింక్ షర్ట్,  బ్లూ డెనిమ్స్ తో ఉండడం చూడవచ్చు. కాగా, తన భర్త క్రికెటర్ విరాట్ కోహ్లీ, కుమార్తె వామికతో కలిసి ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్​లో ఉంది అనుష్క శర్మ. ఆమె తన టూర్​కు సంబంధించిన ముచ్చట్లను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎప్పటికప్పుడు షేర్​ చేస్తూ అభిమానులతో తన పర్యటన వివరాలు పంచుకుంటుంది. 

తాజాగా అనుష్క మరో పోస్ట్ ను షేర్ చేసింది. ఒక ఫొటోలో తన జుట్టును బ్రష్ చేస్తుండగా…  మరొ దాంట్లో ఆమె సూర్యుడిని చూసి నవ్వుతున్నట్టు కనిపిస్తోంది.  మరొకటమే తెల్లటి టీ-షర్టు,  బ్లూ జీన్స్ లో పొలాల దగ్గర నిలబడి ఉండగా ఆమె వెనుక సూర్యుడిని చూపిస్తూ ఉండడం చూడొచ్చు. దీనికి ఆమె “సన్నీ సైడ్ అప్” అనే క్యాప్షన్ కూడా ​ పెట్టింది. అంతేకాకుండా “#sweatyselfie.” అనే పేరుతో తన మేకప్ లుక్‌లో అనుష్క చాలా అందంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement