Thursday, April 25, 2024

అంటే….సుంద‌రానికి ‘జీరోత్’ లుక్ – ఎప్పుడంటే

రీసెంట్ గా శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చాడు హీరో నాని. తాజా చిత్రం అంటే…సుంద‌రానికీతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు నాని. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి జనవరి 1వ తేదీ 4:05 నిమిషాలకు జీరోత్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కె పి వి ఎస్ ఎస్ పి ఆర్ సుందర ప్రసాద్ పాత్రను పరిచయం చేయనున్నట్టుగా చెప్పారు. అంటే మన కథానాయకుడు సుందరానికి ఇది అసలుపేరు. జీరోత్ లుక్ అంటూ ఈ కొత్త ప్రయోగం .. కొంత సస్పెన్స్ వెనుక క్రియేటివిటీ ఏమిటనేదే చూడాలి. సినిమాలో నాని జోడీగా నజ్రియా నజీమ్ కనువిందు చేయనుంది. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement