Friday, April 19, 2024

రాధేశ్యామ్ నుంచి మ‌రో అప్‌డేట్‌.. ప‌ర‌మ‌హంస‌గా రెబ‌ల్ స్టార్‌..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ కావడంతో ప్రేక్షకులు మరో అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాగా, ఈరోజు ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు న‌టిస్తున్న విష‌యంపై క్లారిటీ ఇస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్‌.

రాధేశ్యామ్ చిత్రంలో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పరమహంసగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహాజ్ఞాని, గొప్ప వ్యక్తి అయిన పరమహంస పాత్ర కోసం ఆయన రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్నార‌ని.. అందుకే గడ్డం పెంచినట్లు కృష్ణంరాజు తెలిపారు. అయితే ప్రభాస్‌తో పాటు ఆయన నటించే సీన్స్ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉందని, త్వరలోనే ముగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

https://twitter.com/RadheShyamFilm/status/1472904484099559424

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement