Friday, April 19, 2024

మ‌రో రికార్డ్ సృష్టించిన విక్ర‌మ్ – బాహుబ‌లి2 రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన క‌మ‌ల్ హాస‌న్ చిత్రం

నాలుగేళ్ల త‌ర్వాత యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన చిత్రం విక్ర‌మ్..ప‌లు రికార్డుల‌ని సృష్టిస్తోంది. తాజాగా బాహుబ‌లి2 రికార్డుల‌ని బ‌ద్ద‌లు కొట్టింది విక్ర‌మ్ చిత్రం.అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ సినిమాను చేయ‌డంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న క‌మ‌ల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ టేకింగ్‌, విజ‌న్ వేరే లెవల్‌. ఇక‌ ఇటీవ‌లే ఈ చిత్రం రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బాహుబ‌లి(రూ.146 కోట్లు) పేరిట ఉన్న 5ఏళ్ళ‌ రికార్డును విక్ర‌మ్ కేవ‌లం 15రోజుల్లోనే బ్రేక్ చేసి.. త‌మిళంలో ఇండ‌స్ట్రీహిట్‌గా నిలిచింది. అంతేకాకుండా త‌మిళంలో రూ.150 కోట్ల క్ల‌బ్‌లో చేరిన మొద‌టి సినిమాగా విక్ర‌మ్ రికార్డు సృష్టించింది. పోటీగా ప‌లు సినిమాలున్న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ‘విక్ర‌మ్’ జోరు మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. తెలుగులోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుంది. విక్ర‌మ్ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ హోం బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ‌ విడుద‌ల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ.7.48 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. కాగా 15 రోజులు పూర్త‌య్యే స‌రికి రూ.14.71 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement