Thursday, April 25, 2024

విజయనగరంలో డెల్టా ప్లస్ వైరస్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ ఉధృతి తగ్గుముఖం పడుతోందని సంబరపడేలోపే డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పుడు దేశాన్ని డెల్టా ప్లస్ వైరస్ వణికిస్తోంది. అయితే ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా తిరుపతిలో మొదటి డెల్టా ప్లస్ కేసు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పుడు రెండో కేసు కలవరపెడుతోంది. విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ వైరస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని పెదగంట్యాడ మండంలంలో డెల్టా ప్లస్ కేసు నమోదయ్యింది. దీంతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అధికారికంగా తెలియాల్సి ఉంది.

డెట్లా ప్లస్ వేరియంట్ కి తొందనగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడం వల్ల.. ప్రమాదం పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే పలు దేశాల్లో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వచ్చిన మ్యూటెంట్ల కంటే డెల్టా ప్లస్ ప్రమాదకరం కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement