Friday, March 29, 2024

AP: మరో ఐఏఎస్ అధికారికి 3 నెల‌ల జైలు శిక్ష

ఏపీలో కోర్టు ధిక్క‌ర‌ణ‌లో మ‌రో ఐఏఎస్ అధికారికి 3 నెల‌ల జైలు శిక్ష ఏపీ హైకోర్టు విధించింది. గ్రేట‌ర్ విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన ఐఏఎస్ అధికారి హ‌రి నారాయ‌ణ‌కి 3 నెల‌ల జైలు శిక్షను విధించింది. విశాఖ న‌గ‌రంలో వీధి వ్యాపారుల‌కు సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయ‌ని కార‌ణంగా ఈ శిక్ష వేసింది. అయితే ఈ శిక్ష అమ‌లును 6 వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు ఏక స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పు వెలువ‌రించింది. విస్తృత ధ‌ర్మాస‌నంలో తీర్పును స‌వాల్ చేసుకునేందుకే ఈ వెసులుబాటు ఇస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. అయితే, విస్తృత ధ‌ర్మాస‌నంలో కూడా ఈ తీర్పుపై స్టే విధించ‌క‌పోతే.. జూన్ 16న హ‌రి నారాయ‌ణ స్వ‌యంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల‌ని కూడా కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement