Thursday, April 18, 2024

వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు.. తక్షణమే రూ.లక్ష సాయం

ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు చేసింది. దీనికి సంబంధించిన నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. జూలై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. పేద కుటుంబంలో అర్జించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానకి వెంటనే సాయమందేలా వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సంపాదించే వ్యక్తి 18-50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి… సహజంగా మరణిస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందించున్నట్లు తెలిపింది. అలాగే సంపాదించే వ్యక్తి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కలవారై… ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించనుంది.

ప్రభుత్వం అందించే మొత్తాన్ని 15 రోజుల్లోగా మృతుల నామినికీ చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపిక చేసిన బీమా సంస్థకు ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. దీనికి కార్మిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇక నుంచి ఈ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పథకాన్ని అమలు చేస్తుంది. బీపీఎల్ కుటుంబాలను ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement