Tuesday, April 23, 2024

Right Education | ఆంధ్రప్రభ అక్షర పోరాటం.. శ్రీచైతన్య స్కూల్ సీజ్, వరుస కథనాలతో దిగివచ్చిన అధికారులు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) శ్రీ చైతన్య స్కూల్ అక్రమాలు, నిర్వహణలో లోపాలపై ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీచైతన్య స్కూల్​ని ఇవ్వాల (మంగళవారం) సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ఆదేశాల మేరకు మండల విద్యాధికారి కృష్ణ శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేశారు. గౌతమ్​ మోడల్ స్కూల్ ను కొనుగోలు చేసి, శ్రీ చైతన్య పేరిట స్కూల్ ను నడిపిస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

ఇక.. గౌతమ్​ స్కూల్ అనుమతితో శ్రీ చైతన్య స్కూల్ నడిపిస్తుండగా.. కార్పొరేట్ స్కూల్ అక్రమాలపై ఆంధ్రప్రభ అక్షర పోరాటం చేసింది. గతంలోనే మండల విద్యాధికారి కృష్ణ మూడుసార్లు శ్రీ చైతన్య యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆంధ్రప్రభలో వరుస కథనాలు రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకే ఎం ఈ వో కృష్ణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ను సీజ్ చేశారు. విషయం ముందే పసిగట్టిన యాజమాన్యం స్కూల్ కు సెలవు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ గౌతమ్​ మోడల్ స్కూల్ పేరుతో నడిపించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కానీ, ప్రస్తుతం శ్రీచైతన్య స్కూల్ బోర్డు లు తొలగించి తిరిగి గౌతమ్​ మోడల్ స్కూల్ బోర్డు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీ చైతన్య స్కూల్ పేరు మారనుండటంతో ఎంతమంది విద్యార్థులు వెళ్లి పోతారనే దానిపై శ్రీ చైతన్య యాజమాన్యం ఆందోళన చెందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement