Friday, April 19, 2024

మంత్రి కేటీఆర్ కి ధ‌న్య‌వాదాలు తెలిపిన ఆనంద్ మ‌హీంద్రా – ఎందుకంటే

అరుదైన రేసుకు రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ వేదిక కానుంది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. కాగా ఈ విష‌యంపై ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. సొంత గడ్డపై తమ కార్లు రేస్ చేయాలన్నది తమ కల అని, ఇప్పుడు ఆ కలను సాకారం చేసేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో‌ సంయుక్తంగా ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల నిర్వహణపై సోమవారం కీలక ప్రకటన చేశారు.

అదే సందర్భంగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న సహకారాన్ని కూడా అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. తెలంగాణ ఐటీ శాఖ ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేసింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ రేసింగ్‌ను నిర్వహించడానికి హైదరాబాద్‌ నగరం ఎంపికైందని వివరించింది. ఫార్ములా వన్ తరహాలోనే ఇ-వన్ చాంపియన్‌షిప్ కూడా ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నది. ఈ రేసింగ్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌కు ప్రత్యేక ట్రాక్ అక్కర్లేదు. ఈ ‘ఈ- వన్ ఫార్ములా’ చాంపియన్‌షిప్ పోటీలను 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంగా మహీంద్ర రేసింగ్ కూడా ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement