Friday, March 29, 2024

బ్రిట‌న్ పార్ల‌మెంట్ లో – ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్

బ్రిట‌న్ పార్ల‌మెంట్ లో మెరిశారు బిజెపి కీల‌క‌నేత‌ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్. ఇండో యూకే రిలేష‌న్స్ అనే అంశంపై చేప‌ట్టిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఆమె పాలుపంచుకున్నారు. ఈ అంశంపై కీల‌కోప‌న్యాసం చేసిన అమృత అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఇండియ‌న్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డును కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు అంద‌జేశారు. ఈ విష‌యాన్ని అమృత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల భార‌త్, బ్రిట‌న్‌ల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగ‌య్యాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు. బ్రిటన్ పార్ల‌మెంటులో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. రాజ‌కీయాల్లో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స‌త్తా చాటుతుంటే… ఇత‌ర‌త్రా సామాజిక కార్య‌క్ర‌మాల్లో అమృత చురుగ్గా పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. నేప‌థ్య గాయ‌నిగా, సామాజిక కార్య‌క‌ర్త‌గా, బ్యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అమృత త‌న అభిప్రాయాల‌ను ధైర్యంగా వెల్ల‌డిస్తూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement