Thursday, December 5, 2024

అమిగోస్ మూవీ రివ్యూ.. క‌ల్యాణ్ రామ్ ప్ర‌యోగం ఫ‌లించిందా..!

విభిన్న‌మైన పాత్ర‌ల‌కి పెట్టింది పేరుగా మారారు హీరో క‌ల్యాణ్ రామ్. బింబిసార చిత్రం త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రం అమిగోస్..ఈ మూవీలో క‌ల్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు సిద్ధార్థ్‌(కల్యాణ్‌ రామ్‌), మంజునాథ్‌(కల్యాణ్‌ రామ్‌) , మైఖేల్(కల్యాణ్‌ రామ్‌) కథే అమిగోస్. వీరు చూడటానికి ఒకేలా ఉన్నా…ఆలోచన విధానంలో పూర్తి విరుధ్దమైన వాళ్లు. వీళ్లలో సిద్ధార్థ్‌(కల్యాణ్‌ రామ్‌)..ఓ బిజినెస్ మ్యాన్. అతను పద్దతైన వాడు,తెలివైన వాడు. ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్‌) తో ప్రేమలో ఉంటాడు. ఆమె ఒప్పించునే పనిలో ఉంటాడు. ఇక బెంగళూరుకు చెందిన మంజునాథ్‌(కల్యాణ్‌ రామ్‌) ఓ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇతను కూడా సాప్ట్ మెంటాలిటీ.ఇక మూడో వాడు కలకత్తాకు చెందిన బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్ (కల్యాణ్‌ రామ్‌) ఓ మోస్ట్ వాటెండ్ క్రిమినల్. ఇక సిద్దార్ద చొరవతో ఈ ముగ్గురూ డోపెల్‌గ్యాంగర్ అనే వెబ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయం చేసుకుని గోవాలో కలుస్తారు. ప్రెండ్స్ అయ్యి బాగా క్లోజ్ మారతారు. అయితే మైఖేల్ అసలు ఎవరనే విషయం మిగతా ఇద్దరికీ తెలియదు. మైఖేల్ వీళ్లను కలవటానికి ముందే ఓ ఎన్ ఐ ఏ ఆఫీసర్ ని చంపేస్తాడు.అతన్ని పట్టుకునే పనిలో ఉంటారు ఎన్ఐఏ టీమ్ అఫీషియల్స్. వారి నుంచి తప్పించుకోవడం కోసం.. బిపిన్ రాయ్.. మైఖేల్‌గా మారి సిద్దార్ధ్, మంజునాథ్‌లను ఇరికిస్తాడు. అంతేకాదు సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ అతని ఇంట్లో, జీవితంలో ప్రవేశిస్తాడు. ఇషికను సైతం ట్రాప్ చేయబోతాడు. అప్పుడు ఎన్‌ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్‌ చేశారు? ఫైనల్ గా వీళ్లద్దరినీ చంపేసి విదేశాలకు పారిపోదామనుకన్న బిపిన్‌ రాయ్‌ నుంచి ఎలా తప్పించుకున్నారు..ఇషిక ను ఎలా రక్షించుకున్నారు… ఫైనల్ గా ఏమైంది అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేషణ‌..అమిగోస్ ట్రైలర్ లో చెప్పిన విషయం చెప్పటానికి ఫస్టాఫ్ మొత్తం తీసుకున్నారు. దాంతో చాలా ప్రెడిక్టబుల్ గా కథ ,కథనం జరుగుతున్నట్లుంది. అంటే కొత్త పాయింట్ చూస్తున్నా..కొత్తగా అనిపించదు. ఇక సిద్దు, ఇషిక లవ్ ట్రాక్ సాదా సీదాగా నడుస్తూంటుంది. ‘అమిగోస్’లో ఎంగేజ్ చేస్తూ, క్యూరియాసిటీ కలిగింటంలో తడబడ్డారు.ఇంట్రస్టింగ్ ఐడియా, సెటప్ ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. కొత్త ట్విస్ట్ లు, కథను పరుగెత్తించే సంఘటనలు పెద్దగా కనపడలేదు. సాదా సీదా స్క్రీన్ ప్లే ని ఇలాంటి ఇంట్రస్టింగ్ కు ఐడియాకు రాసుకోవటమే ఇబ్బంది పెట్టింది. ఇంటర్వెల్ వచ్చేదాకా ఫస్టాఫ్ లాగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండాఫ్ ఉన్నంతలో బాగుంది కానీ అద్బితమైతే కాదు. సినిమా లేపి కూర్చో బెట్టేక్లైమాక్స్ లేదు. అదీ అర్దమైపోతుంది. ఏదైమైనా వావ్ మూమెంట్స్ అతి తక్కువగా ఉన్నాయి.

- Advertisement -

టెక్నికల్.. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలోనే ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే మొదటి సారి దర్శకత్వానికి మరింత కలిసి వచ్చేది. అయితే దర్శకుడుగా మూడు వేరియేషన్స్ కళ్యాణ్ రామ్ నుంచి రాబట్టుకోవటంతో సక్సెస్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లాట్ గా ఉంది. ఇలాంటి థ్రిల్లర్ కథలకు మరింత హాంట్ చేసేలా బాగుండాలి. పాటలు జస్ట్ ఓకే. ఎన్నోరాత్రులు వస్తాయి కానీ. రీమిక్స్ సాంగ్ సినిమాలో అప్పటి వింటేజ్ ప్లేవర్ ని రిపీట్ చేయలేదు. వాటి ప్లేస్ మెంట్ కూడా విసిగించింది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది కొన్ని చోట్ల. మైత్రీ వారి ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడేదేమీ లేదు. ఓ స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త గ్రిప్పింగ్ గా చేసి ఉంటే బాగుండేది.మొత్తానికి ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. ఈ మూవీ జ‌యాప‌జ‌యాలు ప్రేక్ష‌కుల అభిరుచిపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర‌చిపోకూడ‌దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement