Thursday, March 28, 2024

అమెరికా తొలి మ‌హిళ విదేశాంగ కార్య‌ద‌ర్శి క‌న్నుమూత‌

క్యాన్స‌ర్ తో పోరాడుతూ అమెరికా తొలి మ‌హిళ విదేశాంగ కార్య‌ద‌ర్శిగా సేవ‌లందించిన మడేలిన్ ఆల్‌బ్రైట్‌ క‌న్నుమూశారు. ఈ మేర‌కు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుద‌ల చేశారు.. ప్రేమ పూర్వ‌క‌మైన‌ తల్లిని, ఓ అమ్మమ్మని, ఓ సోదరి ని, ఓ స్నేహితుడిని కోల్పోయాం, ఆమె నిరంత‌రం ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ఛాంపియన్” అని కుటుంబ‌స‌భ్యులు ప్రకటనలో పేర్కొనారు.1993లో అప్ప‌టి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హ‌యంలో.. ఐక్యరాజ్యసమితిలో U.S. అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ ప‌ద‌విలో మూడు సంవత్సరాల పాటు కొన‌సాగింది. ఆ తర్వాత 1997లో Madeline Albright ను విదేశాంగ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ఆ స‌మ‌యంలో 99-0 ఓట్లతో విదేశాంగ కార్యదర్శిగా నామినేట్ అయ్యారు . ఇలా తొలి విదేశాంగ కార్య‌ద‌ర్శిగా ఆల్‌బ్రైట్‌ ఘ‌న‌త సాధించింది.

ఆల్‌బ్రైట్‌ ఈ పదవిలో నాలుగు సంవత్సరాల పాటు కొన‌సాగారు. కొసావోలో NATO విస్తరణ, సైనిక చ‌ర్య‌ల‌పై చురుకుగా స్పందించారు. 2001లో ప‌దవికి రాజీనామా చేసిన త‌ర్వాత‌.. ఆమె జార్జ్‌టౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో టీచింగ్ చేశారు. ఈ స‌మయంలో ఎన్నో పుస్తకాల‌ను ఆమె ర‌చించారు. ఏడు సార్లు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. 2012లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆల్‌బ్రైట్‌కు దేశ అత్యున్నత పౌర గౌరవమైన మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేసి.. గౌర‌వించారు. త‌న చివ‌రి ఇంటర్వ్యూ ను 2020 లో ఆమె ఎల్లే మ్యాగజైన్ కి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా.. ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఇలాంటి ఉన్న‌త‌మైన ప‌ద‌వుల‌ను చేపడుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా.. యునైటెడ్ స్టేట్స్ సెక్రట‌రీ వ్య‌వ‌హ‌రించ‌డం చాలా ఉన్న‌త‌మైన అనుభ‌వ‌మ‌ని అన్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement