Thursday, April 18, 2024

అమెరికా జాన‌ప‌ద రాక్ స్టార్ సింగ‌ర్.. డేవిడ్ క్రాస్బీ క‌న్నుమూత‌

గిటార్ వాయించ‌డంలో దిట్ట‌..అమెరికా జాన‌ప‌ద రాక్ స్టార్ సింగ‌ర్ డేవిడ్ క్రాస్బీ క‌న్నుమూశారు..1941, ఆగ‌స్టు 14వ తేదీన క్రాస్బీ కాలిఫోర్నియాలో జ‌న్మించారు. ఆస్కార్ విన్న‌ర్ ఫ్లాయిడ్ క్రాస్బీ కుమారుడే ఈయ‌న‌. ద బ‌ర్డ్స్ బ్యాండ్‌లో అత‌ను 1964లో చేరాడు. అమెరికా జాన‌ద బృందాల‌తో చాలా ఆల్బ‌మ్స్ చేశాడత‌ను. బాబ్ డిలాన్‌తోనూ ప‌నిచేశాడు. సింగ‌ర్ జాని మిచల్‌తో డేటింగ్ చేశాడు. క్రాస్బీ, స్టిల్స్‌, నాష్‌లు ఓ గ్రూపుగా మారి హిట్ ఆల్బ‌మ్స్ అందించారు. ఆయ‌న వ‌య‌సు 81 ఏళ్లు. 1960 ద‌శ‌కంలో అత‌ను రెండు అతిపెద్ద బ్యాండ్ గ్రూపుల‌ను ఏర్పాటు చేశాడు. రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అత‌ను రెండుసార్లు ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ అస్వ‌స్థ‌త కార‌ణంగా క్రాస్బీ ప్రాణాలు విడిచిన‌ట్లు ఆయ‌న భార్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement