Wednesday, March 27, 2024

అమేథీలో మార్పే లేదు : కేంద్రంపై రాహుల్ ఆగ్రహం

అమేథీ-ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పించే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేధీ నియోజకవర్గంలో సోదరి ప్రియాంక గాంధీతో కలసి పర్యటించిన ఆయన రెండేళ్ల క్రితం అమేథీ ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉందని, అభివృద్ధి మచ్చుకైనా కన్పించలేదని, ఏ వీధిని చూసినా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. 2019లో లోక్ సభ ఎన్నికల తరువాత రాహుల్ రెండోసారి ఇప్పుడు అమేథీలో పర్యటించారు. యూపీ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నప్రియాంక గాంధీతో కలసి ఆయన నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. అమేథీలో కన్పిస్తున్న మార్పు స్థానికుల‌లో ఆగ్రహం మాత్రమేనని అన్నారు. అమేధీ ప్రజల గుండెల్లో ఎప్పటిలా మాకు చోటుందన్నారు.

2004లో ఇక్కడి నుంచే తొలిసారి పోటీలో నిలిచాన‌న్నారు. రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలే నాకు ఎన్నో పాఠాలు నేర్పారు. రాజకీయాల్లోకి వెళ్లేలా నాకు మార్గదర్శనం చేశారు. అమేధీ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటా అని అన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటలాంటి అమేధీలో 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతుల్లో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ద్రవ్యోల్బణ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న రాహుల్ మళ్లీ పూర్వవైభవం కోసం శ్రమిస్తున్నారు. ర్యాలీలో మాట్లాడిన రాహుల్ ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలుగుప్పించారు. ఇటీవల కాశీయాత్ర సందర్భంగా ప్రధాని గంగాస్నానం ఆచరించారు. కానీ పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యల్బణం వంటి సామాన్యుల సమస్యలను వారు పట్టించుకోరని విమర్శించారు. మోడీ తీసుకున్న జీసీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి ఏకపక్ష నిర్ణయాలవల్ల పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి నిర్ణయాలకు కోవిడ్ సంక్షోభం తోడవడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement