Thursday, April 25, 2024

బుట్టబొమ్మకి 700మిలియన్ వ్యూస్..4.4మిలియన్ లైక్స్..

అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలన్నీ రికార్డ్స్ నెలకొల్పాయి. ఆ చిత్రంలోని పాటల్లో బుట్ట బొమ్మ’ పాట రికార్డ్ మీద రికార్డ్ లు తెచ్చిపెట్టింది.. ఇప్పటికీ ఈ పాటకి క్లిక్కుల మీద క్లిక్కులు వస్తూనే ఉన్నాయి. ఇలా తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 700 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా తెలుగులో ఈ ఘనతను అందుకున్న తొలి హీరోగా బన్నీ చరిత్రను సృష్టించాడు. ఇక, ఈ పాటకు 4.4 మిలియన్ లైకులు కూడా వచ్చాయి. ఇది సౌత్‌లోనే అరుదైన రికార్డు. అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మ’ పాట 700 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం ద్వారా ఎన్నో రికార్డులు కనుమరుగైపోయాయి. మరీ ముఖ్యంగా ఈ పాట ‘రౌడీ బేబీ’ తర్వాత ఎక్కువ వ్యూస్ సాధించి సౌత్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక, ఇండియా వ్యాప్తంగా అల్లు అర్జున్ సాంగ్ 28వ స్థానంలో నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ చిత్రంలో బుట్టబొమ్మగా పూజాహెగ్డే నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement