Thursday, April 25, 2024

అచ్చు ఆలియాభ‌ట్ లా చిన్నారి – ఛోటీ ఆలియా అంటూ కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం గంగూబాయి క‌తియావాడి. ఈ చిత్రంలో అచ్చు ఆలియాలా న‌టించింది ఓ చిన్నారి. కియారా ఖ‌న్నా అనే చిన్నారి ఆలియా చెప్పిన డైలాగ్స్ కి లిప్ సింక్ చేసింది. అచ్చు ఆలియా వైట్ శారీలో మెరిసింది ఆ చిన్నారి. ఈ వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది శివాని జె ఖ‌న్నా. కాగా ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిముషాల్లో 78వేల మంది చూడ‌టం విశేషం. విడుదలకు ముందే గంగూబాయి కతియావాడి సోషల్ మీడియాలో హల్‌చల్ క్రియేట్ చేసింది. అలియా భట్ ఇప్పటి వరకు న‌టించిన చిత్రాల‌న్నింటిలో ఇది బలమైన పాత్రలలో ఒకటిగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆలియా చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని ఆకట్టుకున్నాయి.

ఈ వీడియోని అత్యంత అందమైన , మధురమైన @aliaabhattకి అంకితం చేయబడింది. మీతో వ్యక్తిగతంగా కలవడం , పని చేయడం ఒక కల లాంటి అనుభూతి. మీ #గంగుబాయికాయిహివాది గంగూబాయ్ జిందాబాద్ చిత్రానికి మా శుభాకాంక్షలు పంపుతున్నాను. మీరు కియారాస్ యాక్ట్ (sic)ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను,” అని వీడియోకి క్యాప్షన్ పెట్టింది.గంగూబాయి కతియావాడిగా చిన్న అమ్మాయి నటనకి బోలెడు కామెంట్స్ వ‌స్తున్నాయి. “ఛోటీ అలియా అని ఒక‌రు. .”అద్భుతం”, “అందమైన” వంటి పదాలతో నిండి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement