Wednesday, April 24, 2024

బాలీవుడ్ కి అఖండ … హీరో ఎవ‌రో ..

రికార్డ్స్ ని తిర‌గ‌రాయ‌డ‌మే కాదు.. కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తుంది అఖండ మూవీ. ఈ చిత్రాన్ని బోయ‌పాటి తెర‌కెక్కించారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా జైశ్వాల్ జంట‌గా న‌టించారు. కాగా ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. . శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా పైన ఇప్పుడు బాలీవుడ్ కన్నుపడింది. ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా స‌మాచారం. అన్ని పక్కగా కుదిరితే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ అఖండ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ ఉందట‌. మ‌రి ద‌ర్శ‌కుడుని మారుస్తారా బోయ‌పాటినే తీసుకుంటారా అనే విష‌యంతో పాటు హీరోయిన్ ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement