Saturday, November 27, 2021

శిల్ప‌క‌ళావేదిక‌లో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎప్పుడంటే..

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ అంటేనే మాస్ అని ప్రేక్ష‌కుల‌కు తెలిసిన విష‌య‌మే. ఇప్ప‌టికే సింహా, లెజెండ్ రెండు చిత్రాల‌తో అల‌రించిన వీరి కాంబినేష‌న్ మూడోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. వీరి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న మూడో చిత్రం అఖండ‌. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2 న విడుద‌ల చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు మూవీ మేక‌ర్స్. ఈ క్రమంలో మూవీ ప్రమోష‌న్స్ బిజీ అయ్యింది చిత్ర బృందం.కాగా బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది.

ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం తమన్ అద్భుతమైన పాటలు అందించారు. నవంబర్ 27న శిల్పా కళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నున్న‌ట్టు తెలిపింది చిత్రయూనిట్‌. ఈ ఈవెంట్ లో ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతోన్నారు. అయితే.. ఈ ఈవెంట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ రాబోతోబోతున్న‌ట్టు తెలుస్తోంది. వీరితో పాటు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులు కూడా వస్తారని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్రానికి యు/ ఏ స‌ర్టిఫికెట్ కూడా వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News